![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -5 లో.. సీతాకాంత్ కార్ పై రామలక్ష్మి కలర్ చల్లుతుంది. మళ్ళీ ఆ అమ్మాయే వచ్చి కార్ క్లీన్ చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు. అందుకే తన అడ్రస్ కనుక్కొని మరి వాళ్ళు ఉండే బస్తీకీ వెళ్తాడు. అక్కడ గల్లీలలో సీతాకాంత్ వెళ్తుంటే ఇబ్బంది పడుతుంటాడు. ఆ తర్వాత గల్లీలో ఇద్దరు ఆడవాళ్లు గొడవపడుతు ఉంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు సీతాకాంత్ డ్రైవర్, అతని అసిస్టెంట్. వాళ్ళని ఆపబోయిన డ్రైవర్‌ని అందరు కలిసి కొడతారు.
కాసేపటికి ఇప్పుడు మేమ్ ఎక్కడికి రాము అంటు.. వాళ్ళ సీతాకాంత్ ని వదిలి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీతాకాంత్ ఒక్కడే వెళ్తుంటాడు. నీ కోసం ఎవరో వచ్చారంటూ బ్యాండ్ అతను.. రామలక్ష్మిని తీసుకొని వస్తుంటే అతనికి వేరే ఫోన్ వచ్చిందని తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఒక్కతే.. ఎవరు వచ్చారంటూ వెళ్తుంది. ఇద్దరు పక్కపక్కన చూసుకోకుండా వెళ్తారు. కానీ ఇద్దరు ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగిపోతారు. ఆ తర్వాత ఎవరి దారిన వెళ్ళిపోతారు. కాసేపటికి సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు తమ ఇళ్ళకు వెళ్తారు. ఎందుకు అలా జరిగింది.. నాకు ఏదో జ్ఞాపకం వస్తుంది? ఎందుకు ఇలా అవుతుందంటూ అనుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి బ్యాంకు మేనేజర్ వస్తాడు. మీ చెక్కు ఫోర్జరీ జరిగింది, అది మీ తమ్ముడు సందీప్ ఇచ్చాడని అనగానే.. లేదు నేనే ఇచ్చానని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ మాటలు వాళ్ళ అమ్మ వింటుంది. నీ చెల్లితో పాటు నీ తమ్ముడిని కూడ గారాబం చేస్తున్నావా.. వాడు చెక్కు విషయం లో తప్పు చేస్తే అలా ఎందుకు అంటున్నావని అనగానే.. వాడికి ఏం అవసరం ఉందో.. అయిన ఇప్పుడు నేను ఆ చెక్కు ఇవ్వలేదని తెలిస్తే నా తమ్ముడుని తప్పుగా అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదని సీతాకాంత్ అంటాడు.
వాడు వదిలేసిన నేను వదలనంటూ శ్రీలత వెళ్లి.. సందీప్ ని చెక్కు ఎందుకు ఫోర్జరీ చేసావంటు అడుగుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి మధ్యలో కలుగుజేసుకొని మా అయనకి కూడా కొన్ని బాధ్యతలు అప్పజెప్పితే బాగుండేదని శ్రీవల్లి అనగానే.. మన కంపెనీలు ఎన్నున్నాయి? వాటి టర్నవర్ ఎంత అని శ్రీలత అడుగుతుంది. సందీప్ సైలెంట్ గా ఉంటాడు. సీతకాంత్ కి ఫోన్ చేసి అడుగగా.. అన్ని ఫాస్ట్ గా చెప్తాడు. నీకు వాడికి తేడా ఇదే అంటూ సీతాకాంత్ గురించి శ్రీలత గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి క్యాబ్ గడుపుతుంటుంది. కొంతమంది తాగుబోతులు రామలక్ష్మి క్యాబ్ బుక్ చేసుకొని అటపట్టిస్తుంటారు. ఇక రామలక్ష్మి పోలీస్ స్టేషన్ వచ్చిందని అనగానే వాళ్ళు పారిపోతారు. ఆ తర్వాత ఆ విషయం బాధపడుతు తన తల్లికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |